![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-107లో.. శ్రీవల్లితో నిశ్చితార్థం కోసం రామరాజు ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. ఇంతలో శ్రీవల్లి.. బావోయ్ అంటూ పెద్దోడ్ని పలకరిస్తుంది. ఆ పిలుపు విని అంతా షాక్ అయిపోతారు. ఏంటీ.. అప్పుడే బావోయ్ అంటుంది ఎవర్నీ అని వేదవతి అడుగగా.. ఇంకెవర్నీ బావగారినే మీ పెద్ద కోడలు చాలా ఫాస్ట్ అని నర్మద అంటుంది. ఇంతలో శ్రీవల్లి.. చందు బావా.. రండి రండి.. అమ్మ వాళ్లు మీకోసం ఎదురుచూస్తున్నారని అంటుంది. ఒరేయ్ పెద్దోడా.. నిన్ను బావా అని పిలిచేటంత కెమిస్ట్రీ-ఫిజిక్స్ ఎప్పుడు డెవలప్ అయ్యాయ్ రా అని తిరుపతి పంచ్‌లు వేస్తాడు. మామగారండి. మర్చిపోయానండి అంటూ రామరాజు కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటుంది శ్రీవల్లి. నా పెద్ద కోడలికి ఎంత గౌరవమో చూసి నేర్చుకోండి గవర్నమెంట్ ఉద్యోగి గారు అని నర్మదతో వేదవతి అంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు నేను కూడా మీ కాళ్లకి నమస్కారం పెట్టాలా ఏంటీ.. నేను కాళ్లకి నమస్కారం పెట్టే టైప్ కాదు.. మా అత్తకి ముద్దు పెడతానంటూ నర్మద చెప్తుంది.
బుజ్జమ్మా.. మన పెద్దోడి అమాయకత్వాన్ని సరిగ్గా సరిపోయే అమ్మాయి దొరికిందని రామరాజు అంటాడు. అదే సమయంలో గుడిలో పంతులుకి సైగ చేస్తుంది భాగ్యం. మరో రెండు రోజుల్లో నిశ్చితార్థానికి దివ్యమైన ముహూర్తం ఉందని, ఖాయం చేసేయమంటారా అని భాగ్యంని అడుగుతాడు. అయ్యో రెండు రోజులంటే.. ఏర్పాట్లు చేసుకోవడం కష్టం అవుతుందేమోనని రామరాజు అంటాడు. మీరు భలే ఉన్నారు అన్నయ్య గారూ.. రాజు తలచుకుంటే దెబ్బలకి కొదువా? మనలాంటి డబ్బున్న వాళ్లకి రెండు రోజుల్లో నిశ్చితార్థం చేయడం పెద్ద కష్టమేమీ కాదండీ.. అన్నీ ఫోన్‌లలో తెగ్గొట్టేద్దామని భాగ్యం అంటుంది. పంతులు గారూ.. మీరు చెప్పిన ముహూర్తానికే నిశ్చితార్థం ఖాయం చేసేయండని భాగ్యం అంటుంది. దాంతో పంతులు ముహూర్తం పెట్టేస్తాడు.
అన్నయ్య గారూ.. మరి ముఖ్యమైన విషయాలు ఏం మాట్లాడుకోలేదు కదా అని భాగ్యం అంటుంది. మాకు కట్నకానుకలేం వద్దని చెప్పాం కదమ్మా.. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటని రామరాజు అడుగుతాడు. అదే అన్నయ్య గారూ.. నిశ్చితార్థం, పెళ్లి ఏర్పాట్లు గురించి మాట్లాడుకోలేదు కదా అని భాగ్యం అంటుంది. ఇందులో మాట్లాడుకోవడానికి ఏం ఉంది.. ఆచారం ప్రకారం పెళ్లి, నిశ్చితార్థం ఆడపిల్ల వారే జరిపించాలి కదా అని రామరాజు అంటాడు. అంటే అన్నయ్య గారండీ.. మా ఇళ్లలో నిశ్చితార్థం ఆడపిల్ల వాళ్లు జరిపిస్తారు.. పెళ్లి మగ పెళ్లి వారే జరిపించుకోవాలని అంటుంది. ఆ మాటతో రామరాజు, వేదవతిలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటారు. చెప్పండి అన్నయ్య గారూ.. పెళ్లి జరిపించేస్తారు కదా అని అంటుంది. కమింగ్ అప్ లో భాగ్యం, భద్రవతి కలుసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |